మంగళవారం, 18 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2024 (18:03 IST)

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

Chocolate to Delight
చాక్లెట్ చూడగానే నోరూరుతుంది. ఐతే తీయగా వుండే ఈ చాక్లెట్లను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అతిగా చాక్లెట్ తినడం జీర్ణ సమస్యలతో సహా అనేక రకాల దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
 
చాక్లెట్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, కనుక వీటిని అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచేస్తుంది.
 
ఎక్కువ చాక్లెట్లు తింటే కెఫిన్ అధిక మోతాదుకు దారి తీస్తుంది, ఇది ఆందోళన, గుండె దడకు కారణమవుతుంది.
 
చాక్లెట్‌లో క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి కనుక దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
 
కొంతమందికి చాక్లెట్‌లోని డైరీ, నట్స్ లేదా సోయా వంటివి అలెర్జీ తలెత్తడానికి కారణమవుతుంది.