శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 ఫిబ్రవరి 2022 (00:02 IST)

ఊరగాయ పచ్చళ్లు తింటే ప్రయోజనాలు ఏంటి?

చలికాలంలో పచ్చళ్లను కూరతో పాటుగా కొద్ది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఇవి జీర్ణవ్యవస్థను, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, నూనెతో ఊరగాయలను తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

 
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉసిరికాయ, ముల్లంగి ఊరగాయలు హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి. చలికాలంలో తయారైన ఊరగాయలు డయాబెటిక్ పేషెంట్లలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ ఊరగాయలు కాలేయానికి మంచివిగా భావిస్తారు. ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్‌ను అందిస్తాయి.
 
 
పచ్చళ్లలో రుబ్బిన మసాలా దినుసులు వాడటం వల్ల పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. పచ్చిమిర్చి పచ్చళ్లలో వాడితే శ్వాసకోశ సమస్యలను అధిగమించవచ్చు. టర్నిప్‌లు, క్యారెట్‌లు, క్యాలీఫ్లవర్‌లను ఎండలో ఉంచడం వల్ల పోషక విలువలు పెరుగుతాయి. గంజి, పప్పు, అన్నం, కిచడీతో పచ్చళ్లను ఆస్వాదించవచ్చు. సీజనల్ ఊరగాయలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుండొచ్చు. కానీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచివి కావని గుర్తుంచుకోవాలి.