మెంతి ఆకుల రసంలో తేనె కలిపి తాగితే ఏమవుతుంది?
జీర్ణాశయ సంబంధ సమస్యలకు ఔషధంలా పనిచేస్తాయి మెంతులు, మెంతి ఆకులు. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మరి మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
కామెర్లు వచ్చిన వారికి, లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. అంతేకాకుండా ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖం మీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారి నుంచి విముక్తి అవ్వచ్చు.