శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 12 ఫిబ్రవరి 2022 (23:59 IST)

కోడిగుడ్డు తింటే ఏంటి ప్రయోజనం?

వారానికి 12 గుడ్లు చొప్పున ఏడాదిపాటు తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లలో గుండెజబ్బులతో వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. పరిశోధన ప్రారంభంలో పాల్గొన్న వారికి గరిష్ఠంగా వారానికి 12 గుడ్లు, కనిష్ఠంగా వారానికి 2 కంటే తక్కువ గుడ్లు తినాలని సూచించారు.

 
మూడు నెలలు చివరి రోజుల్లో గుడ్లు తిన్నవారిలో హృదయరోగ సంబంధిత వ్యాధులకు కారణమైయ్యే ప్రమాద కారకాలను గుర్తించలేదు. పరిశోధనలో పాల్గొన్నవారిని మూడు గ్రూపులుగా విభజించారు. మూడునెలలపాటు వీరికి గుడ్లు అందించారు. మొదటి గ్రూపు వారికి గుడ్లు తక్కువ, ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. 

 
రెండో గ్రూపువారికి బరువు తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇస్తూ మొత్తం మూడు నెలలు అదనంగా ఇచ్చారు. ఇక చివరి గ్రూపువారికి మిగతా ఆరునెలలు నుంచి పన్నెండు నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినాలని సూచించారు. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. గుడ్డు తినడం వల్ల కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని వారంటున్నారు. ముఖ్యంగా గర్భవతులకు ఎంతో ఆరోగ్యకరమని సూచిస్తున్నారు.