గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 28 డిశెంబరు 2019 (20:47 IST)

ఎలాంటి క్రొవ్వు పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిదంటే?

క్రొవ్వు అన్న పదం వినగానే అది చెడుగా భావించకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని రెండు రకాలుగా చూడాలంటున్నారు. మంచి ఫ్యాట్స్, చెడు ఫ్యాట్స్. శరీరానికి ఈ మంచి క్రొవ్వు పదార్థాల వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయట. పోషకాలలో ఇవి ముఖ్యమైనవిగా చెప్పుకోవాలంటున్నారు.

ముఖ్యంగా ఈ ఫ్యాట్స్ శరీరంలో క్రొవ్వు కణజాలం లాగా చేరి బాగా ఒత్తిడికి గురైనప్పుడు, ఆరోర్యం చెడిన సమయంలో లేదా ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు శరీరానికి కావాల్సిన శక్తిని ఫ్యాట్స్‌గా ఇస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఒక గ్రాము ఫ్యాట్ నుంచి తొమ్మిది క్యాలరీలు లభిస్తాయట. అలాగే శరీరంలోని మెదడు, గుండె, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాల చుట్టు ఉండేది నీరు, ఒక్క పొరలాగా ఫ్యాట్స్ ఉంటాయట. నరాల చుట్టూ ఎముకల చుట్టూ కూడా ఉండి వాటి పనితీరును అభివృద్థి చేస్తాయట. ఫ్యాట్స్ చర్మం క్రింద ఉండి శరీరాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉండేలా చూస్తాయట.
 
శరీరంలో పేరుకున్న అధిక క్రొవ్వు శాతం కరిగేందుకు మెటాబాలిక్ చర్య అధికంగా జరగాలి. కాబట్టి చాలా శక్తి అవసరం. అందుకే ఫ్యాట్స్ తగ్గాలి అంటే శరీరానికి మంచి ఫ్యాట్స్ తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. 60 శాతం మెదడు భాగం ఫ్యాట్స్‌తో నిండి ఉంటుందట. కాబట్టి మెదడు చురుకుగా పనిచేయాలంటే మంచి ఫ్యాట్స్ అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
కడుపుతో ఉన్న మహిళలకు లోపల బిడ్డ యొక్క శరీర ఎదుగుదలకు, మెదడు తయారీకి కూడా ఫ్యాట్స్ అవసరమట. ముఖ్యంగా పాలిచ్చే బాలింతకు మంచి క్రొవ్వు పదార్థాలు తప్పనిసరిగా ఇవ్వాలట. తల్లిపాలలో అధికంగా ఉండేది ఫ్యాట్స్, నీరు కాబట్టి. మంచి ఫ్యాట్స్ కోసం నట్స్, పల్లీలు, వాల్ నట్స్, బాదం, పిస్తా, ఆలివ్, అవకాడో నూనె, వేరుశెనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనెలను వాడితే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.