ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (18:17 IST)

రొమాన్సును ఉన్నట్టుండి ఆపేస్తే.. గుండెకు ప్రమాదమా?

వివాహమైనప్పటి నుంచి రోజూ రొమాన్స్ చేసుకునే వ్యక్తి ఉన్నట్టుండి ఏదైనా అనివార్య కారణాల చేత రొమాన్స్‌ను ఆపేస్తే... ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది. మద్యపానం, ధూమపానం వంటి వాటిని ఎలా మెల్ల మెల్లగా తగ్గ

వివాహమైనప్పటి నుంచి రోజూ రొమాన్స్ చేసుకునే వ్యక్తి ఉన్నట్టుండి ఏదైనా అనివార్య కారణాల చేత రొమాన్స్‌ను ఆపేస్తే... ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది. మద్యపానం, ధూమపానం వంటి వాటిని ఎలా మెల్ల మెల్లగా తగ్గించుకున్నట్లే.. అలాగే రొమాన్స్‌ను కూడా మెల్ల మెల్లగా తగ్గించుకోవాలని పరిశోధకులు చెప్తున్నారు. ఈ మద్యపానం, ధూమపానం, రొమాన్స్ ఈ మూడింటిలో దేన్నైనా ఉన్నట్టుండి వెంటనే వదిలిపెడితే గుండెపోటు వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
రొమాన్స్‌లో పాల్గొనేటప్పుడు సంతోషాన్నిచ్చే హార్మోన్లు అధిక శాతం ఉత్పత్తి అవుతాయి. కానీ రొమాన్స్‌నప ఆపేస్తే మాత్రం హార్మోన్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు హార్మోన్ల లోటుతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని పరిశోధకులు చెప్తున్నారు. రొమాన్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుందని.. సెక్స్‌లో పాల్గొనడం.. అరగంట పాటు వ్యాయామం చేసినంత సమమైన గుండెచప్పుడును పెంచుతుంది. అదే రొమాన్స్‌ను ఆపేస్తే హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు పరిశోధకులు తేల్చారు.