మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (12:01 IST)

వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2022: రక్తపోటు నియంత్రణకు సింపుల్ టిప్స్

Hypertension
Hypertension
వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2022 నేడు. ఈ సందర్భంగా రక్తపోటును నియంత్రించుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ధూమపానం, అధిక ఉప్పు తీసుకోవడం, ఒత్తిడితో సహా అధిక రక్తపోటుకు కారణమయ్యే వాటికి దూరంగా వుండాలి. 
 
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మరణానికి ప్రధాన కారణాలలో హైపర్ టెన్షన్ ఒకటి. వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2022 థీమ్.. "మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి." తద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా వుంచవచ్చు. 
 
ప్రస్తుతం మనలో చాలా మంది ఒత్తిడి, జీవనశైలిలో మార్పు కారణంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి ఎదుర్కొంటున్నారు. అధిక రక్తపోటుతో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో హృదయనాళ మరణాలకు అధిక ప్రమాదం ఉంది. 
 
అందుచేత అధిక రక్తపోటును నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు అవసరం. సరైన చికిత్స, పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి. ఆహార మార్పులలో ఉప్పు తగ్గింపు, మద్యపానాన్ని మితంగా తీసుకోవడం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. అలాగే చక్కెర తక్కువ తీసుకోవాలి. రోజూ అర్ధగంట వ్యాయామాం తీసుకోవాలి. హైపర్ టెన్షన్ ఉంటే, ధూమపానం మానేయడం చేయాలి. 
 
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించడం, ఉప్పును తక్కువగా తీసుకోవడం, టేబుల్ ఉప్పును నివారించడం ద్వారా బీపీని తగ్గించవచ్చు. యోగా, ధ్యానం కూడా గొప్ప స్ట్రెస్ బస్టర్స్‌గా పనికివస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.