శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (10:16 IST)

ఆ కారణంగానే భారతీయులకు గుండె జబ్బులు

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా, భారతీయ పౌరులతో పోల్చుకుంటే ఉత్తర అమెరికా, యూరప్ ప్రజలు ఎంతో బెటరంటున్నారు.

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా, భారతీయ పౌరులతో పోల్చుకుంటే ఉత్తర అమెరికా, యూరప్ ప్రజలు ఎంతో బెటరంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువట.. ఈ విషయంలో అమెరికా, యూరప్ ప్రజలే ఎంతో మేలట. 
 
ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలకు చెందినవారితో పోలిస్తే.. భారతీయుల ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం తక్కువగా ఉంటుందట. ఈ కారణంగానే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం నుంచి భారతీయులు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ విషయాలను సీఎస్ఐఆర్ (శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి)లోని జీనోమిక్స్‌, ఇంటిగ్రేటివ్‌ బయోలజీ విభాగం డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 
 
ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండటం వెనుక.. జాతి, శారీరక శ్రమ, పోషకాహారం, పెంపకంలాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ విషయాలను అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.