శృంగారంలో పాల్గొంటే అది మాయమవుతోందంటోంది... ఏం చేయాలి?
నాలుగేళ్ల ప్రేమ తర్వాత ఆమెను పెళ్లాడాను. ప్రేమించిన కాలంలో ఇద్దరం పరస్పరం ఎన్నో విషయాలను చెప్పుకున్నాం. ఐతే ఇప్పుడు నాకు అనుకోని సమస్య వచ్చింది. ఆమె శృంగారం పేరెత్తితే ససేమిరా అంటోంది. మన ప్రేమను పదిలపరుచుకోవాలంటే దాంట్లో పాల్గొనగూడదని అంటోంది. అలా పాల్గొంటే ఇద్దరిలో ఉన్న ప్రేమ మాయమైపోతోందని అంటోంది.
ఈమధ్య బ్రతిమాలుడుతూ శృంగారం చేయబోయాను. పెద్దగా ఏడ్చేసి గోళ్లతో గీరుతూ తనపై నుంచి నన్ను కిందికి తోసేసింది. ఆమెను దారిలోకి ఎలా తెచ్చుకోవాలో అర్థం కావడంలేదు. ఆ విషయం గురించి మాట్లాడితే.. నాతో మాట్లాడనని అంటోంది. పెద్దలకు చెప్పాలంటే గోలవుతుందని బెంగగా వుంటోంది. ఏం చేయాలి..?
ఇది ఇబ్బందికర సమస్యే. ప్రేమికుల్లో కొందరు ఇలాంటి ఆలోచనలతో ఉంటుంటారు. ప్రేమ పవిత్రమయినదనీ, శృంగారం చేస్తే అది కాస్తా అపవిత్రం అయిపోతుందని అనుకుంటారు. అందువల్ల ఆ పేరెత్తగానే భార్యగా వచ్చినా యువతి అయిష్టతను ప్రదర్శిస్తుంది.
ఈ పరిస్థితుల్లో ఆమె మనసును అటువైపు మరల్చడం పురుషునికి కొంత కష్టమే. అయినప్పటికీ ఎంతగానో ప్రేమిస్తుంది కనుక మెల్లగా ఆమె సెక్సీ భాగాలపై చేతులతో స్పృశిస్తూ ఆ ఆలోచనలు రేకెత్తించేట్లు చేయాలి. అలా మెల్లిమెల్లిగా ఆమెను ఆ వైపు తిప్పాలి. ఆరాధిస్తున్నా దాంపత్య సుఖంతోనే అది పరిపూర్ణమవుతుందని నచ్చజెప్పాలి. అప్పటికీ వినకుంటే మానసిక వైద్యులకు చూపించి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిందే.