బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 8 జులై 2021 (22:53 IST)

షుగర్ వ్యాధి వున్నవారు పనస తొనలు తినవచ్చా?

పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.
 
పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యవృద్ధిని కలిగించి, అంగస్తంభన సమస్యల్ని తగ్గించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.
 
ఇది శరీరంలోని రోగ నిరోధరక శక్తిని పెంచుతుంది. శరీరంలోని అనేక రుగ్మతల బారినుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడి డి.ఎన్.ఎ ను డ్యామేజీ బారి నుండి కాపాడుతుంది.
 
ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.
 
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.  
 
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
 
పనసపండులో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలు పెళుసుగా మారే సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.