బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2019 (22:19 IST)

అబ్బో పొట్ట ఉబ్బరం... గ్యాస్ సమస్య, వదిలించుకోవాలంటే?

ప్రస్తుతకాలంలో చాలామంది వయసుతో సంబందం లేకుండా గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి తినకపోవడం, నూనె, మసాలాలతో చేసిన పదార్దాలు తినడం, అతిగా తినడం, మలబద్దకం లాంటి సమస్యల వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉన్న పదార్దాలతో ఔషదాన్ని తయారుచేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. అల్లం రసం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లం రసంలో కాస్త బెల్లం పొడిని కలుపుకుని తాగుతూ ఉంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.
 
2. కొన్ని ధనియాలు, అందులో కాస్త శొంఠి కలపండి. దాన్ని కషాయం మాదిరిగా చేసుకోండి. దాన్ని రోజూ తాగితే క్రమంగా గ్యాస్‌ ట్రబుల్‌ తగ్గిపోతుంది.
 
3. కాస్త సోంపు తీసుకుని అలాగే జీలకర్ర కూడా కొద్దిగా తీసుకోండి. వాటిని మెత్తగా పొడిలా చేసుకోండి. కాస్త వేడి నీటిలో ఈ పొడిని కలిపి రోజూ తాగుతూ ఉండండి. గ్యాస్ ట్రబుల్ సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
 
4. రోజూ పరగడుపున కరివేపాకులు తింటే చాలా ప్రయోజనాలున్నాయి. అందులో ఒకటి గ్యాస్ ట్రబుల్ సమస్య నయం కావడం. కరివేపాకును తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.
 
5. వాము ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్యను అదుపులోకి తెచ్చుకోవొచ్చు. రోజూ రాత్రి వాము తింటే చాలు. గ్యాస్ ట్రబుల్ నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.