వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే?
మనం రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను తెలియకుండా అధికంగా తినేస్తుంటాం. మరికొన్నింటిని అసలు తినకుండా వదిలేస్తాం. దీనివల్ల పోషక పదార్థాల సమతుల్యత కోల్పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేటిని తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
1. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగినది. తల వెంట్రుకలకు కూడా చాలా మంచిది. షుగర్ వ్యాధిని నిరోధించడంలో మంచి మందులా పనిచేస్తుంది.
2. చింతపండు అధికంగా తినేవారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది. శరీరం లావై, బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడటాన్ని తగ్గించుకోవటం మంచిది.
3. ఆవాలు దురదను, శరీర నీరసాన్ని తొలగిస్తాయి.
4. కొత్తిమీర శరీరం క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.
5. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తిన్నచో శరీరానికి బలం వస్తుంది.