వేధించే దగ్గుకి, స్థూలకాయం తగ్గడానికి ఇది చాలు...

సిహెచ్| Last Modified బుధవారం, 8 జులై 2020 (22:15 IST)
ఆరోగ్య సమస్యలు అందరికీ వస్తూనే వుంటాయి. సహజమైన సమస్యల్లో దగ్గు ఒకటి. ఈ సమస్య కొందరికీ ఎంతకీ తగ్గదు. అలాంటివారు పొడి 10 గ్రాములు, ఉప్పు పావు టీ స్పూన్, మిరియాల పొడి స్పూన్ కలిపి ఉంచుకుని రెండుపూటలా పూటకు ఒకట్రెండు గ్రాముల చూర్ణము చప్పరించి మింగుతుండాలి. అంతే మొండిదగ్గు మటుమాయం అవుతుంది.

కొందరు స్థూలకాయంతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు రోజుకు ఉదయం 200 మిల్లీ లీటర్ల నీటిలో 5 గ్రాముల జీలకర్ర వేసి కొద్దిసేపు నాననిచ్చి, మరిగించి, దించి గోరువెచ్చగా వున్నప్పుడు వడగట్టి అరబద్ద నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే శరీరంలో అధికంగా సంచితమైన కొవ్వు కరిగి అధికబరువు లేదా స్థూలకాయ సమస్య తగ్గుతుంది.

అలాగే జీలకర్ర పొడి, కరక్కాయ పెచ్చుల పొడి, ఉప్పు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజుకు ఒకట్రెండుసార్లు దంతధావనచూర్ణంగా వాడుకుంటుంటే చిగుళ్లవాపు, నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పంటి నొప్పులు తగ్గుతాయి.దీనిపై మరింత చదవండి :