శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (17:49 IST)

రెడ్ వైన్ తాగితే ఇన్ని ఇబ్బందులా?

చాలా మంది రెడ్‌వైన్‌ను ఇష్టంగా త్రాగుతుంటారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే దానిని పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది. రెడ్‌వైన్‌ను ఎక్కువ పరిమాణంలో త్రాగితే క్యాన్సర్, హృద్రోగాలతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శుద్ధిచేయని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షారసం తాగడం వలన కాలేయం దెబ్బంతింటుంది. 
 
శరీరంలో చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా చెబుతున్నారు. అధికంగా రెడ్‌వైన్ త్రాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయి. చర్మం కళను కోల్పోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
కళ్ల కింద నల్లటి వలయాలు రావడం కూడా జరుగుతుంది. మెుటిమలు, చర్మంపై గల మృతకణాల వలన రంధ్రాలు ఏర్పడతాయి కనుక సాధ్యమైనంతవరకు రెడ్‌వైన్‌ను తాగకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.