ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (10:26 IST)

వేసవిలో మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా వుంచే 8 పండ్లు ఇవే, తినండి

వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవచ్చు.
 
పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్‌గా వుంటుంది.
 
కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
 
తియ్యగా ఉండే కర్బూజా పండ్లు తినడం వలన శరీరానికి లవణాలు అందుతాయి. నీటి శాతం పెరుగుతుంది. వేసవి తాపం తీరుతుంది.
 
బొప్పాయి పండ్లలో కూడా నీటిశాతం ఉంటుంది కనుక వీటిని తింటుంటే వేసవిలో వచ్చే రుగ్మతల నుండి దూరంగా వుండొచ్చు.
 
స్ట్రాబెర్రీస్ తింటుంటే కూడా రోజువారీ శరీరానికి అవసరమైన నీరు అందుతుంది, ఫలితంగా వేసవిలో అలసినట్లు వుండదు.
 
వేసవిలో మ్యాంగో జ్యూస్ ప్రేగు వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది, కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది.