మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (14:20 IST)

ఎండుద్రాక్షాలతో అలసట, ఒత్తిడికి చెక్ పెట్టవచ్చును...

ఎండుద్రాక్షలలో విటమిన్స్, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ద్రాక్షల్లోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. జీర్ణాశయం లోపలి భాగానికి రక్షణను ఇస్తుంది. కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతుంది.

ఎండుద్రాక్షలలో విటమిన్స్, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ద్రాక్షల్లోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. జీర్ణాశయం లోపలి భాగానికి రక్షణను ఇస్తుంది. కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతుంది. ఈ ద్రాక్షలను తరచుగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఈ ద్రాక్షల్లోని ఐరన్ రక్తసరఫరాను మెరుగుపరచుటకు దోహదపడుతుంది. వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లను తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వలన అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోయి రోజంతా తాజాగా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు.