శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 మే 2021 (22:54 IST)

మారేడు ఆకులతో మొలలు సమస్య తగ్గుతుంది, ఏం చేయాలంటే?

ప్రకృతి మనకు ఎన్నో సహజసిద్ధమైన ఔషధ గుణాలున్న వృక్షాలను, మొక్కలను ఇచ్చింది. అలాంటి వాటిలో కొన్ని మొక్కలు, వాటి ఔషధ విలువలు గురించి తెలుసుకుందాం.
 
మారేడు ఆకులతో మొలల సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగుతూ వుండాలి. మారేడు కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా మొలలు తగ్గుతాయి.
 
అలాగే ఉమ్మెత్త ఆకుకి మానసిక రోగాలను హరించే గుణం వుంది. కనుక ఈ  ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేస్తుంటే మానసిక రుగ్మతలు తొలగుతాయి.
 
ఉత్తరేణి ఆకులకు దంతవ్యాధులను నయం చేసే శక్తి వుంది. అందువల్ల ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తగ్గిపోతాయి.
 
తులసి ఆకులు గురించి చాలామందికి తెలుసు. ఇవి దగ్గు, వాంతులను నయం చేస్తాయి. తులసిని సర్వ రోగనివారిణిగా చెపుతుంటారు. ఈ ఆకులను రోజు నాలుగైదు తింటే మంచిది.