సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By mohan
Last Modified: బుధవారం, 3 మే 2017 (16:17 IST)

వేసవిలో కళ్లు మంటలా... ఇలా చేయండి...

ఏటుకేడు వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ సంవత్సరం మరీ ఎక్కువ స్థాయిలో ఉంది. దీనికి కాలుష్యం ఒక కారణం. దీని స్థాయి పెరిగే కొద్దీ అతినీలలోహిత కిరణాలు భూమిని తాకడం ఎక్కువైంది. దీనివల్ల కంటికి, చర్మానికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పట

ఏటుకేడు వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ సంవత్సరం మరీ ఎక్కువ స్థాయిలో ఉంది. దీనికి కాలుష్యం ఒక కారణం. దీని స్థాయి పెరిగే కొద్దీ అతినీలలోహిత కిరణాలు భూమిని తాకడం ఎక్కువైంది. దీనివల్ల కంటికి, చర్మానికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటికే వేడి వల్ల 30% శాతం వరకు కంటి సమస్యల కేసులు పెరిగాయని కంటి వైద్యులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా కన్నులు మంట కలిగి ఎరుపు రంగులోకి మారడం, దురదగా ఉండటం, కన్నులు ఎరుపుగా ఉండి కనురెప్పలు వాచినట్టు ఉండడం మొదలైనవి వేడి వల్ల కలిగే లక్షణాలు. దీని నుండి ఉపశమనం పొందాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగడం, ప్రయాణించడం, కష్టంతో కూడిన పని చేయడం వంటివి తగ్గించాలి. అవసరం ఉంటేనే బయటకు రావాలి, వీలైతే సన్‌గ్లాసులు వాడండి. 
 
తలపై టోపీ లేదా రుమాలు ధరించండి. క్రమం తప్పకుండా తలకు నూనె రాయాలి. కంటికి చుక్కల మందు వేసుకోవాలి. ఒక టీ బ్యాగ్‌ని తీసుకొని చల్లటి నీళ్లలో ముంచి కనురెప్పల మీద 10-15 నిమిషాల పాటు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి. ఇలా రోజులో 2-3 సార్లు చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. సమస్య తీవ్రం అయ్యేట్లు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.