బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (22:14 IST)

వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

వేసవి కాలం వచ్చింది. ఈ వేసవిలో పిల్లలు అనారోగ్యంతో బాధ పడుతూఉంటారు. దీనికి కారణం పిల్లలకు ఆహారం పట్ల సరియైన అవగాహన లేకపోవడం, ఈ సమయంలో ద్రవపదార్థాలను ఎక్కువుగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. అవి ఏమిటంటే... 1. వెలగపండు... ఎన్నో ఔషధ

వేసవి కాలం వచ్చింది. ఈ వేసవిలో పిల్లలు అనారోగ్యంతో బాధ పడుతూఉంటారు.  దీనికి కారణం పిల్లలకు ఆహారం పట్ల సరియైన అవగాహన లేకపోవడం, ఈ సమయంలో ద్రవపదార్థాలను ఎక్కువుగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. అవి ఏమిటంటే... 
 
1. వెలగపండు... ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దీనికి సమ్మర్ ప్రూట్ అని పేరు. పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్న ఈ పండు గుజ్జు, లేదా పానీయం ఠారెత్తిస్తున్న ఎండల వల్ల అనారోగ్యం బారిన పడకుండా పిల్లల్ని కాపాడుతుంది. 
 
2. సోంపు.... వేసవిలో సోంపు తినడం వల్ల కలిగే మేలు చాలా ఎక్కువ. ఇది నోటిని తాజాగా ఉంచడమే కాకుండా ఆంత్రరసాలను స్థిరపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్టలో ఆమ్లాల విడుదలను తగ్గిస్తుంది. 
 
3. లెమన్ గ్రాస్... వేడిని తట్టుకోలేక పదేపదే పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటే వాళ్ల ఆహారంలో లెమన్ గ్రాస్ చేర్చండి. ఇది హెర్బల్ మెడిసిన్‌లా పనిచేసి వాంతులు, జ్వరం, ప్లూ, తలనొప్పి వంటి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. కండరాల నొప్పులు ఉన్నవాళ్లు లెమన్ గ్రాస్ నూనె వాడితే ఉపశమనం కలుగుతుంది. 
 
4. ఖస్ షర్బత్... ఈ జ్యూస్ రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ పానీయం సేవిస్తే శరీరం చల్లగా ఉంటుంది. అందుకని ఈ వేసవిలో కూల్ డ్రింక్‌లకు బదులుగా పిల్లలకు ఖస్ షర్బత్ మంచిది.
 
5. గుల్ కంద్... పాన్ షాపులో దీన్ని ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. వేసవిలో ఇది ప్రతి రోజు తినడం మంచిది. గుల్ కంద్ ఎసిడిటి రాకుండా నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది.