మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 9 ఆగస్టు 2018 (22:39 IST)

చింత గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు...

మనం ప్రతిరోజు వంటలలో చింతపండు వాడుతూ ఉంటాము. కేవలం చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే... వయసు పెరగడం, అధిక బరువు వంటి కారణాల వల్ల మోకాలిలో కీళ్లు అరిగిపోయి మోకాలి నొప్పి కలుగుతుంది. దీనిన

మనం ప్రతిరోజు వంటలలో చింతపండు వాడుతూ ఉంటాము. కేవలం చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే... వయసు పెరగడం, అధిక బరువు వంటి కారణాల వల్ల మోకాలిలో కీళ్లు అరిగిపోయి మోకాలి నొప్పి కలుగుతుంది. దీనిని తగ్గించటానికి చింతగింజల పొడి అద్భుతంగా పనిచేస్తుంది. చింతగింజలను తీసుకొని పుచ్చులు లేకుండా బాగా శుభ్రపరచుకోవాలి. వీటిని బాగా వేయించిన తర్వాత మంచి నీటిలో రెండు రోజులపాటు నానబెట్టాలి. ప్రతిరోజు రెండు పూటలా నీటిని మారుస్తుండాలి.
 
ఇలా నానిన చింతగింజలను పొట్టు తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. చింత గింజల పొడిని రోజుకు రెండుసార్లు అర టీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో నెయ్యి లేక చక్కెర కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే రెండుమూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మోకాలి నొప్పి పూర్తిగా తగ్గుతుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.