సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: గురువారం, 29 నవంబరు 2018 (14:03 IST)

ఈ పండ్లు తింటే బక్కపలచనివారు చూడచక్కగా మారుతారు...

సన్నగా ఉన్నారా? బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రూట్స్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల పండ్లు బరువును కూడా పెంచుతాయి. మరీ సన్నగా ఉండే వారు, బరువు పెరగాలంటే కొన్ని పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. 
 
సిట్రస్ పండ్లు, మెలోన్స్ మరియు బెర్రీస్ వంటి పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీర మెటబాలిజంను పెంచుతుంది. అరటి పండ్లు శరీరక బరువును పెంచడంలో సహాయపడుతాయి. అరటిలో అధిక కాలరీలుంటాయి. 105 హై క్యాలరీ కంటెంట్ వల్ల మీరు శరీర బరువు పెరుగుతుంది. 
 
ఇక డ్రై నట్స్... ఎండు ద్రాక్ష, జీడిపప్పు మరియు బాదంలు సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలను కలిగి ఉంటాయి. ఈ డ్రైఫ్రూట్స్ శరీరం యొక్కబరువును క్రమంగా పెంచుతాయి. 
 
అలాగే పండ్లలో రారాజు మామిడిలో అధిక కాలరీలుండటం వల్ల బరువును శరీర బరువును పెంచుతుంది. ఒక్క మామిడిలో వంద క్యాలరీల కంటెంట్ ఉంటుంది. కాబట్టి, బరువు పెంచడంలో మామిడిపండ్లు బాగా పనిచేస్తాయి. సపోటాలో అధిక కాలరీలుండటం వల్ల, శరీర బరువు పెరుగుతారు.