సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (10:08 IST)

సప్తసముద్రాలు దాటిన మన బతుకమ్మ (Video)

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ.

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ మన బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడే కనిపిస్తూ ఉంటుంది. 
 
మరి ఇలాంటి పండుగ సప్తసముద్రాలు దాటితే ఎలా ఉంటుంది. ఇదే ఆలోచన లండన్‌లో సెటిల్ అయినా మన తెలంగాణ అమ్మాయికి వచ్చింది. మన బతుకమ్మ పండగని లండన్ దేశస్థులకి పరిచయం చేసింది. స్వాతి రెడ్డి మన తెలంగాణ ఆడపడుచు. మెహబూబ్ నగర్ లో పుట్టి లండన్ లో సెటిల్ అయి, గాయనిగా మంచి పేరు తెచ్చుకోవాలని తనకు నచ్చిన పాటలు నిర్మించి  పాడి లండన్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లండన్ లో జరిగే తెలుగు కార్యక్రమాలలో తాను ముందుంటారు. 
 
ఇప్పుడు బతుకమ్మ పండగ సందర్భంగా మన తెలంగాణ ఆడపడుచు స్వాతి రెడ్డి ఒక్క సరికొత్త బతుకమ్మ పాటను నిర్మించారు. లండన్ అందాలతో లండన్ ముద్దుగుమ్మల మధ్య మన బతుకమ్మ పాటను ఆడి పాడారు. తెలంగాణ సాంస్కృతిక సంపద అయినా  బతుకమ్మ పండగను సప్తసముద్రలు దాటించింది మన స్వాతి రెడ్డి. 
 
ఈ లండన్‌లో బతుకమ్మ పాటకు  భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించగా సురేష్ ఉపాధ్యాయ లిరిక్స్ రాసారు. నరేందర్ రెడ్డి లొంక ఈ అందమైన పాటను రాగ్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు.