1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2020 (21:52 IST)

గ్లాసు మంచినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే?

ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు శీతాకాలంలో తుఫాను వర్షాలు. ఈ నేపధ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువ. అందులో మరీ దగ్గు, జలుబు ముందుంటాయి. ఈ లక్షణాలు కనబడితే ఇప్పుడు కరోనావైరస్ అనే భయం కూడా వెంటాడుతోంది. ఐతే అన్ని లక్షణాలు కరోనావైరస్ కావు. అందువల్ల పొడిదగ్గు వచ్చిన వెంటనే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
 
1. అరకప్పు నీటిలో ఒక స్పూన్‌ పసుపు, ఒక స్పూన్‌ మిరియాల పొడి, ఒక స్పూన్‌ తేనె వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.
 
2. దగ్గు విడవకుండా వస్తున్నట్లయితే టేబుల్‌ స్పూన్‌ తేనె తీసుకుంటే మంచిది.
 
3. నిద్రించే ముందు అల్లం టీ తాగితే మంచిది.
 
4. దగ్గు బాధిస్తున్నప్పుడు ఫ్లాట్‌గా ఉన్న బెడ్‌పై పడుకోకుండా తలపై దిండ్లను ఎత్తుగా పెట్టుకోవాలి. దీనివల్ల గొంతులో కొంచెం గరగర రాకుండా ఉంటుంది.
 
5. గ్లాసు నీటిని గోరు వెచ్చగా వేడి చేసి చిటికెడు ఉప్పు వేసి పుక్కిలించాలి. 
 
6. గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. 
 
7. వేడి పాలలో ఒక స్పూన్‌ తేనె కలుపుకుని తాగితే పొడి దగ్గునుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.