బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 డిశెంబరు 2021 (22:03 IST)

మిల్క్ పౌడర్లు కాదు, రాగి జావ-మాల్ట్ తాగితే...

ఎముకల్లో క్యాల్షియం లోపిస్తే వచ్చే సమస్యలు చాలా ఇబ్బందిపెడతాయి. అందుకే ఈ క్యాల్షియం పుష్కలంగా వుండే రాగులను పిల్లలకి ఆహారంలో చేరుస్తుండాలి. రాగుల్లో ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి.

 
ఎదిగే పిల్లలకు రాగి జావ, మాల్ట్ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతలు దృఢంగా మారుతాయి.

 
రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తరచూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరానికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల నొప్పిని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నివారించే గుణాలు రాగుల్లో ఉన్నాయి. రాగులతో తయారుచేసే మాల్ట్‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. 

 
రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.