ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2024 (22:49 IST)

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

green tea
గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ సేవిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.
గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు, రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది.
గ్రీన్ టీ కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.
గ్రీన్ టీ త్వరగా బరువు తగ్గటానికి అద్భుతంగా పనిచేస్తుంది.
గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకు మంచిది, మతిమరుపు రాకుండా చేస్తుంది.
కీళ్లనొప్పులతో బాధ పడేవారికి గ్రీన్ టీ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.