శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (21:37 IST)

రాత్రిపూట ఇవి తింటే ఏమవుతుందో తెలుసా? (video)

1. పెరుగు తినడం మానెయ్యండి - రాత్రి వేళల్లో పెరుగు తినడం వలన అది జలుబు, దగ్గును అధికం చేస్తుంది.
 
2. భోజనానంతరం ఎక్కువ నీరు త్రాగకండి. అయితే ఒక గంట తర్వాత కొద్దిగా వేడి నీరు తీసుకోండి. ఆ నీరు త్రాగడం వలన జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
 
3. పసుపు వేసిన పాలను త్రాగండి- పసుపు వేసిన పాలను త్రాగడం వలన కఫం రాకుండా చేస్తుంది, బ్యాక్టీరియాని తగ్గించడంతోపాటు బాగా నిద్ర పట్టేలా చేస్తుంది.
 
4. చక్కెర అధికంగా ఉండే కేక్‌లు, కుకీలు తినకండి. ముఖ్యంగా చక్కెరకు బదులుగా తేనెను వాడటం వల్ల అది కూడా కఫం రాకుండా చేస్తుంది, అలాగే బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
 
5. దాల్చిన చెక్క, పెద్దజీలకర్ర (సోంపు), మెంతులు మరియు ఏలకులను ఉపయోగించడం ద్వారా ఆహారాన్ని రుచిగా మార్చడమే కాక శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతాయి. శరీర బరువును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
 
6. పచ్చి సలాడ్‌లను రాత్రుల్లో తినవద్దు, ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పు ధాన్యాలు, బ్రోకోలీ వంటివి తీసుకోవడం వల్ల మీ కొవ్వు నిల్వలను కరిగించడంలో సహాయపడతాయి.
 
7. ఉప్పు వాడకం బాగా తగ్గించండి, అందువల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు మరియు అకాల మరణం కలగకుండా ఉంటుంది.
 
8. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వలన జీర్ణమయ్యేందుకు కష్టతరంగా మారుతుంది. అందుకే మితాహారం తీసుకోండి.