శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 17 మార్చి 2022 (23:15 IST)

వేసవిలో మజ్జిగ ఎందుకు తాగాలి?

వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగ కొన్ని ఇతర ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైన బి విటమిన్.

 
సాధారణ పాల కంటే మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెన్న తీయడానికి కొవ్వును తొలగిస్తారు. క్రమం తప్పకుండా మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. తద్వారా ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

 
మజ్జిగ రెగ్యులర్ వినియోగం రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటు మరియు గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు మేలు చేస్తాయి.