బుధవారం, 21 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2015 (22:20 IST)

ఆదిశేషుడిపై కలియుగనాథుడు.. తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు కలియుగ దైవం మొదటిరోజు రాత్రి మలయప్పస్వామి పెద్దశేషవాహనంపై తిరుమాడవీధుల విహరించారు. సాయంత్రం ధ్వజారోహణం చేశారు. ఆ తరువాత రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలను సర్పించారు. అనంతరం వాహనమండపం వద్దకు వెళ్ళి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. నాగులలో అగ్రజుడైన ఆదిశేషుడు నిరంతరం నారాయణసేవలో వుంటాడు. అచంచలమైన భక్తికి తార్కాణం ఆదిశేషుడు. 
 
స్వామివారు సర్వాంగ సుందరుడిగా తయారై పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తరించారు. గోవింద నామస్మరణలతో ఆయనను కొనియాడారు.