శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (16:41 IST)

పెళ్లయిందా అయితే శుక్రవారం తలస్నానం చేయకండి...

ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తలస్నానం చేసేందుకు ఇష్టపడుతుంది. ముఖ్యంగా.. పెళ్లయిన ఆడవారు మాత్రం ప్రతి రోజూ తలస్నానం చేశాకే వంటగదిలోకి వెళుతుంటారు. అయితే, వివాహమైన వారు తప్పనిసరిగా ప్రతి బుధవారం తలస్నానం చే

ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తలస్నానం చేసేందుకు ఇష్టపడుతుంది. ముఖ్యంగా.. పెళ్లయిన ఆడవారు మాత్రం ప్రతి రోజూ తలస్నానం చేశాకే వంటగదిలోకి వెళుతుంటారు. అయితే, వివాహమైన వారు తప్పనిసరిగా ప్రతి బుధవారం తలస్నానం చేయాలని హిందూ పురాణాలు చెపుతున్నాయి. ఎందుకంటే... 
 
సాధారణంగా శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లు తలస్నానం చేస్తుంటారు. శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయరాదు. తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడంతో సమానమన్నమాట. తలకు శాంపులు పెట్టుకోవడం, దీనిని తలంటు అని కూడా అంటారు. రోజూ తలస్నానం చేసే వారికి మాత్రమే వర్తించదు. వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 
 
మంగళవారం, శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు. ఒక వేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌక్యాలన్నీ దూరవుతాయిట. శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంగా, ఎంతో అన్యోన్యంగా ఉంటారట. సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం ఉంటుంది. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయడం వల్ల దోషం కలుగుతుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఆ రోజులలో మాత్రం తలస్నానం చేయకూడదు.