ప్రతిక్షణం ఏదో కొత్త పని చేస్తున్నామనే ఆసక్తితో చేస్తే?
వ్యాపారం చేస్తున్నా, ఆధ్యాత్మిక పధంలో ఉన్నా, మీరేదేన్నా కొత్తగా చేయాలని తలపెట్టినా, అందులో ఎంతో ఆసక్తి కనబరచాలి. ఇష్టంతో ప్రయత్నం చేయాలి. చేపట్టిన పనిలో గెలుపు పొందాలంటే మీ చాకచక్యాన్ని, శక్తిని పరిపూర్ణంగా కేంద్రీకరించాలి అప్పుడే జీవితంలో సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంటారు.
అలవాటుపడిన పనే కదా అన్న భావనతో అశ్రద్ధ చేయడమో, తప్పనిసరనో చేయవద్దు. ప్రతిక్షణం ఏదో కొత్త పని చేస్తున్నామన్న ఆసక్తితో చేయండి. మీ పూర్తి క్రియాశీలతను వెలువరించండి. ఆసక్తితో హృదయ పూర్వకంగా శ్రద్ధగా చెయ్యండి. అప్పుడే మీ జీవితంలోని ప్రతిమెట్టును హాయిగా దాటుకుంటూ ముందుకు సాగిపోగలుగుతారు.
నిజంగా భగవంతుణ్ణి గొప్పవాడిగా అనుకుంటే మీరు అనుకున్నది జరగకపోయినా అంతా భగవంతుడి ఇష్టప్రకారమే జరుగుతుంది అని సంతోషపడాలి. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడకూడదు. తప్పుల్ని భరించడానికి, సహించడానికి అలవాటు పడాలి. తప్పుల్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం.