బుధవారం, 21 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (09:02 IST)

హంస వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి..

తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి మలయప్ప స్వామి హంస వాహనంపై ఊరేగారు. చదువుల తల్లి సరస్వతీ దేవి రూపంలో మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనం గురువారం రాత్రి తిరుమాడ వీధులలో తిరిగాడింది. 
 
వీణాపాణి రూపంలో హంస వాహనంపై మలయప్పస్వామిని చూస్తే జ్ఞానం సిద్ధిస్తుందని పురణాలు చెబుతున్నాయి. అదే భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా. పాలను నీళ్ళను వేరు చేయగల హంస ఉన్న స్వామిని దర్శిస్తే మనలోని అజ్ఞానం వీడిపోయి జ్ఞానం మిగులుతుందని నమ్మకం. ఈ హంస వాహన సేవలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొన్నారు.