శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (14:14 IST)

అంచనాలకు మించి వసూళ్ళను రాబట్టిన రీ-రిలీజ్ మూవీలు

avatar
ఇటీవలికాలంలో పలు రీ-రిలీజ్ చిత్రాలు అంచనాలు మించి వసూళ్లను రాబట్టాయి. హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సౌత్ సినిమా ఈ మేరకు చెప్పుకోదగిన కలెక్షన్స్‌ను అందుకున్నాయి. బాలీవుడ్ చిత్రం 'తుంబాడ్' ఈ రిలీజ్ కలెక్షన్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రం విడుదల రోజున రూ.37.5 కోట్లు రాబట్టింది.

అలాగే, 'సనమ్ తేరి కసమ్' రూ.28.3 కోట్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. విజయ్ 'గిల్లి' రూ.26.5 కోట్లతో మూడో స్థానంలో ఉంది. రణబీర్ కపూర్ చిత్రం 'ఏ జవానీ హై దివాని' చిత్రం రూ.25.4 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

'ఇంటర్ స్టెల్లార్' రూ.18.3 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. 'టైటానిక్' రూ.18 కోట్లు, 'షోలే' రూ.13 కోట్లు, 'లైలా మజ్ను' రూ.11.60 కోట్లు, 'రాక్‌‍స్టార్' రూ.11.5 కోట్లు, 'అవతార్' రూ.10 కోట్ల గ్రాస్‌తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.