కుక్కతో కలిసి వాకింగ్ చేస్తూ కుప్పకూలిపోయిన నటి

Tanya Roberts
ఐవీఆర్| Last Modified సోమవారం, 4 జనవరి 2021 (13:38 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
కరోనావైరస్ వచ్చాక అమెరికాలో అకాల మరణాలు సంభవిస్తున్నాయి. కొందరు కారణం తెలియకుండానే హఠాన్మరణం చెందుతున్నారు. జేమ్స్ బాండ్ 007 నటి తన్య రాబర్ట్ కూడా తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తూ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు.

ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరిలించి చికిత్స అందించారు. కానీ ఆమె పరిస్థితి క్షీణించి ఆదివారం నాడు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు మైక్ పింగెల్ స్థానిక మీడియాకి తెలిపారు.

నటి తాన్య టీవీ నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1985లో జేమ్స్ బాండ్ 007 చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.దీనిపై మరింత చదవండి :