శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (13:03 IST)

ఆస్కార్ -2020లో సత్తా చాటిన 'జోకర్'

హాలీవుడ్ అవార్డుల పంపిణీ పండుగ ఆస్కార్ 2020 లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్‌లో కన్నులపండుగగా జరిగింది. హాలీవుడ్‌ తారలతో పాటు పలు దేశాలకి చెందిన నటీనటుల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచంలోని తారలందరూ ఒకే చోట చేరడంతో ఆ ప్రాంగణం శోభాయమానంగా మారింది. 
 
92వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకి సంబంధించి అవార్డులని ప్రధానం చేస్తున్నారు. ఉత్తమ యానిమేటేడ్‌ షార్ట్‌ ఫిలింగా హెయిర్‌ లవ్‌ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్‌ దక్కగా, ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్‌పిట్‌ (వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌), బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలింగా టాయ్‌ స్టోరీ చిత్రాలు అవార్డులని దక్కించుకున్నాయి. 
 
కాగా, ఆస్కార్ కిరీటం అందుకునేందుకు మొత్తం తొమ్మిది చిత్రాలు బ‌రిలో నిలిచాయి. వాటిలో జోక‌ర్, పారాసైట్‌, 1917, మ్యారేజ్ స్టోరీ, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్‌, లిటిల్ ఉమెన్‌, ఫోర్డ్ వర్సెస్‌ ఫెరారి, ఒన్స్ ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. ఆస్కార్ 2020 అవార్డులను గెలుచుకున్న చిత్రాల జాబితాను పరిశీలిస్తే, 
 
ఉత్తమ చిత్రం - పారాసైట్‌
ఉత్తమ డైరెక్టర్ - బోన్‌ జోన్‌ హో (పారాసైట్‌)
ఉత్తమ నటి  - రెనీ జెల్వెగ‌ర్ (జూడి)
ఉత్తమ నటుడు - జాక్విన్  ఫొనిక్స్ (జోక‌ర్)
ఉత్తమ సపోర్టింగ్‌ నటి - లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు- బ్రాడ్‌పిట్‌ (వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే - బాంగ్‌ జూన్‌ హో, హన్‌ జిన్‌ వోన్‌ (పారాసైట్‌)
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే  - టైకా వైటిటి (జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌- టాప్ స్టోరీ 4
బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిలిం - పారాసైట్ (కొరియ‌న్‌)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ - అమెరికన్ ఫ్యాక్ట‌రీ
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ - లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ (ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌-  ది నైబ‌ర్స్ విండో
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ - హెయిర్‌ లవ్
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌-   హిల్ధార్ (జోక‌ర్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌-  (ఐ యామ్ గొన్నా) ల‌వ్ మీ ఎగైన్..  రాకెట్‌మ్యాన్
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ -   డొనాల్డ్ సిల్వెస్ట‌ర్‌ (ఫోర్డ్ వ‌ర్సెస్ ఫెరారి)
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌-  మార్క్ టేల‌ర్‌, స్టువ‌ర్ట్ విల్స‌న్‌ (1917)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్ - వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ - రోజర్‌ డికెన్స్‌ (1917)
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ - బాంబ్ షెల్‌
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ -  జాక్వెలిన్ దుర‌న్‌ (లిటిల్ ఉమెన్‌)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌-  మేఖేల్‌ మెక్‌ సుకర్‌, ఆండ్రూ బక్‌ ల్యాండ్‌ (ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ)
బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - రోచ్‌ రాన్‌, గ్రెగ్‌ బట్లర్‌, డోమినిక్‌ తువే (1917)