శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (15:55 IST)

'బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్' పాప్ సింగర్ ఇకలేరు

"బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్" అనే ఆల్బమ్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికా పాప్ సింగర్, నటుడు మీట్ లోఫ్ ఇకలేరు. ఆయనకు వయసు 74 యేళ్లు. మైఖేల్ లీ అడే అనే నిక్ నేమ్‌తో పిలిచే ఈయన... గత ఆరు దశాబ్దాలుగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. మీట్ లోఫ్ మరణాన్ని ఆయన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించారు. ఆయన మరణ సమయంలో భార్య, స్నేహితులు పక్కనే ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. 
 
కాగా, ఈయన ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఆల్బమ్‌లను విక్రయించారు. ఆయన రూపొందించిన ఆల్బమ్‌లలో బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్, ప్యారడైజ్ బై ది డ్యాష్‌బోర్డు వంటి అనేక ఆల్బమ్‌లు ఉన్నాయి. ఆయన 65 సినిమాల్లో నటించారు.