శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (14:35 IST)

అమెరికా ఘోర విమానం ప్రమాదం: హాలీవుడ్ నటుడు జోయ్ లారా మృతి

Joe Lara
అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు జోయ్ లారా మరణించారు. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో జోయ్ లారాతో పాటు ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తున్న విమానం శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాదానికి గురైంది. 
 
సౌత్​ నాష్​విల్లేలోని పెర్సీ స్ట్రీక్​ లేక్​లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​ ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయినవాళ్లలో నటుడు జోయ్​ లారా, అతని భార్య గ్వెన్​ ష్వాంబ్లిన్ ఉన్నారు. ఈ ఘటనలో శకలాలు చెల్లాచెదురయ్యాయని.. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.  
 
ఇకపోతే.. జోయ్​ లారా ‘టార్జన్​’ సిరీస్​లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. కాగా, లారా(విలియమ్​ జోసెఫ్​ లారా) 1989లో వచ్చిన ‘టార్జాన్ ఇన్​ మాన్​హట్టన్’​ సినిమా ద్వారా ఫేమస్​ అయ్యారు. ఆ తర్వాత 1996 నుంచి ఏడాదిపాటు టెలికాస్ట్ అయిన ‘టార్జాన్​ ది ఎపిక్​ అడ్వెంచర్స్’ టీవీ సిరీస్​ ద్వారా గ్లోబల్​ వైడ్ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. 
 
స్వతహాగా మార్షల్​ ఆర్ట్స్​ నిపుణుడైన​ లారా.. టార్జాన్​గా డూప్​ లేకుండా స్టంట్స్​ చేసేవారు. ఇక చాలా ఆలస్యంగా 55 ఏళ్ల వయసులో లారా..  గ్వెన్​ ష్వాంబ్లిన్​ను 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.