గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:31 IST)

శెనగలు తినండి హాయిగా నిద్రపోండి

మాంసాహారంలో వుండే ప్రోటీన్లన్నీ శెనగలలో వున్నాయని.. వీటిని వారానికోసారి లేదు రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

శెనగల్లో పీచు ఎక్కువగా వుండటం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. రక్తహీనతకు శెనగలు భేష్‌గా పనిచేస్తాయి.
 
ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి బీపీని నియంత్రిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చేస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శెనగలు తోడ్పడుతాయి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
 
క్యాల్షియం ద్వారా దంతాలు, ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే శెనగలతో నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. శెనగల్లో వుండే సెరొటోనిన్, అమివో యాసిడ్లు అనే పోషకాలు హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి. ఇందులోని మాంగనీస్, సల్ఫర్ చర్మవ్యాధులను దూరం చేస్తుంది. కిడ్నీకి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.