ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (18:22 IST)

అధిక బరువు అని నోరెందుకు కట్టేసుకోవడం... మినపప్పును నూనెలో వేయించి..?

అధిక బరువు తగ్గాలనుకునేవారు.. తినే ఆహారాన్ని తగ్గించడం కంటే.. సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతైనా మంచిదంటున్నారు వైద్యులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్స్ తినడం కూడా ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించడమే కాకుండా జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. మరి ఆ స్నాక్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం..
 
1. తామర గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని శరీర కొవ్వును కరిగించే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వంటి ఖనిజాలు అధిక బరువు తగ్గించడంలో మొదిటి పాత్రను పోషిస్తాయి.
 
2. మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ప్రోటీన్స్‌ లభిస్తాయి. దాంతోపాటు జీర్ణక్రియను ఉపకరించే పీచు ఈ విత్తనాల్లో అధికంగా ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కూడా కలిపి తీసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి.
 
3. సెనగలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్సి తింటే.. అధిక బరువు త్వరగా తగ్గుతారు.
 
4. మినపప్పుతో ఇడ్లీ వంటివి చేసుకుని తింటే కూడా బరువు తగ్గుతారు. దాంతో స్నాక్‌గా గారెలు కూడా తినొచ్చును. మినపప్పును నూనెలో వేయించి.. ఆపై 3 ఎండుమిర్చి, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ వేయించుకోవాలి. వీటన్నింటితో పాటు కొద్దిగా చింతపండు వేసి కచ్చాపచ్చాగా నూరి వేడివేడి అన్నంలో కలిపి నెయ్యి వేసి తింటుంటే.. నోటికి రుచిగా బాగుంటుంది. ఇలా చేసిన వాటిని తింటుంటే.. అధిక బరువు తగ్గుతుంది.