బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (10:29 IST)

రోజుకు 2 జిల్లేడు ఆకులతో చక్కెర వ్యాధికి చెక్.. ఎలా?

జిల్లేడు మొక్క.. దీన్నే ఆర్క లేదా మదర్ ప్లాంట్ అని కూడా అంటారు. జిల్లేడు చెట్టు నిండా పాలు ఉంటాయి. ఈ మొక్కలో మూడు జాతులు ఉన్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్రజిల్లేడు, రాజుజిల్లేడు. ఈ మొక్క బీడుగావుండే అన్ని

జిల్లేడు మొక్క.. దీన్నే ఆర్క లేదా మదర్ ప్లాంట్ అని కూడా అంటారు. జిల్లేడు చెట్టు నిండా పాలు ఉంటాయి. ఈ మొక్కలో మూడు జాతులు ఉన్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్రజిల్లేడు, రాజుజిల్లేడు. ఈ మొక్క బీడుగావుండే అన్ని ప్రదేశాల్లో పెరుగుతుంది. ఇది చిన్న గుబురు మొక్క. ఆకులపైనా కొమ్మలపైనా తెల్లని బూడిద పొట్టు ఉంటుంది. ఈ మొక్క ఆయుర్వేద శాస్త్రంలో మెడిసన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. 
 
ఈ సంప్రదాయ ఆరోగ్యప్రదాయనితో చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు. అదీ రోజుకు రెండు ఆకులతోనే. పైగా, షుగర్ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓసారి పరిశీలిద్ధాం. 
 
ప్రతి రోజూ రెండు జిల్లేడు ఆకులను తీసుకుని పాదాలను స్పృశించాలి. ఆ ఆకులను ముక్కలు ముక్కలుగా చేసి పాదాల కింద పెట్టుకోవాలి. ఈ ఆకులని షూ లేదా సాక్సులతో కప్పితే ఇంకా మంచిది. ఇలా రెండు కాళ్ల కింద పెట్టుకుని ఉదయం నుంచి సాయింత్రం వరకు ఉంచుకోవాలి. తర్వాత అవి తీసి పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి. 
 
ఇలా ఒకవారం పాటు చేయాలి. అయితే, ప్రతిసారీ కొత్త ఆకులనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఓ వారం రోజుల తర్వాత బ్లడ్ షుగర్‌ని చెక్ చేసుకుంటే ఆశ్చర్యపోయే ఫలితం కనిపిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే, ఈ ఆకుల పాలు కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలి. అలాగే, బాలింతలు ఈ ప్రయోగానికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.