1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : సోమవారం, 13 జూన్ 2016 (16:11 IST)

పాలక్ పరోటా ఎలా చేయాలో తెలుసా?

ఎప్పుడూ ఒకే ఉప్మా, దోశ, ఇడ్లీలు, పొంగలి తినాలంటే విసుగ్గా ఉంటుంది. అలాంటప్పుడు వెరైటీగా పరోటాలు ఎంచుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మనసొంతమవుతుంది. పరోటాలను చాలా రకాలుగా చేసుకోవచ్చు. వాటిలో ఒకటైన పాలక్

ఎప్పుడూ ఒకే ఉప్మా, దోశ, ఇడ్లీలు, పొంగలి తినాలంటే విసుగ్గా ఉంటుంది. అలాంటప్పుడు వెరైటీగా పరోటాలు ఎంచుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మనసొంతమవుతుంది. పరోటాలను చాలా రకాలుగా చేసుకోవచ్చు. వాటిలో ఒకటైన పాలక్ పరోటా గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు : 
గోధుమపిండి - 2 కప్పులు
పాలకూర - 1 కప్పు(ఉడికించినది),
ఉప్పు - రుచికి తగినంత, 
మిరపపొడి - తగినంత, 
నెయ్యి - కొద్దిగా. 
 
తయారుచేయు విధానం : 
పాలకూరను నీళ్లలో వేసి ఉడికించుకోవాలి. నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పాత్రలో గోధుమపిండిలో తగినంత నీరిపోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పాలకూర, ఉప్పు, మిరపపొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పరోటాలు మెత్తగా, మృదువుగా వస్తాయి. తరువాత మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పరోటాలుగా వత్తుకోవాలి. ఈ పరోటాలను పెనంపై సన్నని సెగపై కాల్చుకోవాలి. ఈ పరోటాలను పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.