శుక్రవారం, 26 డిశెంబరు 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (18:01 IST)

ఇంటీరియర్ డెకరేషన్ : సాల్వియా మొక్కను ఎలా నాటుకోవాలి?

ఆన్‌లైన్‌లో, మార్కెట్లో విరివిగా దొరికే సాల్వియా విత్తనాలను మొదట సీడ్లింగ్ ట్రేలలో నాటుకోవాలి. దీనికోసం గుల్లబారినట్లు ఉండే మట్టిని ఎంచుకోవాలి. దానిలో ఎరువుని కలుపుకోవాలి. ఎరువు, మట్టి మిశ్రమాన్ని ట్రేలోకి తీసుకుని విత్తనాలను నాటుకోవాలి. తగినంత నీటిని చల్లి.. ట్రేను చీకటిగా ఉన్న వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. 
 
రెండు వారాల తర్వాత మొలక వస్తుంది. ఇలా మొలకలొచ్చిన మొక్కను నాలుగు నుంచి ఆరువారాల వకతు మధ్య కావలసిన ప్రదేశంలోకి మార్చుకోవాలి. నేలలో నాటుకునేటప్పుడు మొక్కకీ మొక్కకీ మధ్య నాలుగు నుంచి ఎనిమిది అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. నేరుగా ఎండ తగిలే విధంగా ఉండకూడదు. నీటిని చేత్తో చల్లుకోవాలి. అవసరమైన మేరకే నీరు పోయాలి. వీలైనంత వరకు ఈ మొక్కలకు ఉదయం పూట నీటిని పోయడం మంచిది.