1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : సోమవారం, 29 డిశెంబరు 2014 (15:12 IST)

పెద్ద పెద్ద ఫ్లవర్‌వాజ్‌లు ఇంట్లో ఎక్కడ పెట్టాలి?

పెద్ద పెద్ద ఫ్లవర్‌వాజ్‌లు కొనుగోలు చేస్తున్నట్లయితే వాటిని హాల్‌లో పెట్టుకోవచ్చు. లగ్జరీ లుక్ కావాలంటే గ్లాస్ వాస్‌లు ఎంపిక చేసుకోవచ్చు. క్రిస్టల్‌వాజ్‌లు కాస్త ఖరీదెక్కువగా ఉంటాయి. అయితే వాటిని పెట్టుకుంటే వచ్చే అందమే వేరు. క్రిస్టల్ వాజ్‌ల్లో గోల్డ్ కోటింగ్ కావాలన్నా దొరుకుతున్నాయి. ఇక డిజైన్ల సంగతి సరేసరి. ఇవి మీ ఇంటికి కొత్త అందాన్నిస్తాయి.
 
ఫ్లవర్ పాట్స్‌లో కూడా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగింది సురాయి. కుండ మాదిరిగా ఉండే ఫ్లవర్ పాట్‌తో ఆధునికత ఉట్టిపడుతుంది. వెడల్పుగా ఉండే పాట్‌లో నీళ్లుపోసి పూలు చల్లి, మధ్యలో దీపం పెట్టి అలంకరించుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. 
 
ఫ్లవర్ వాజ్‌ల్లో చిన్నవే కాకుండా పెద్దవి కూడా ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా పూలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిని ఫ్లవర్ పాట్‌లు అంటారు. రిచ్‌నెస్ కోరుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు.