బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (15:02 IST)

పట్టాలు దాటుతున్న మినీ బస్సు.. రైలు ఢీ.. 11 మంది మృతి

Accident
పట్టాలు దాటుతున్న మినీ బస్సును రైలు ఢీకొనడంతో 11 మంది మరణించిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఛట్టోగ్రామ్ జిల్లాలో శుక్రవారం జరిగింది. 
 
అమాన్ బజార్ ప్రాంతంలోని ఒక కోచింగ్ సెంటర్‌కు చెందిన కొందరు విద్యార్థులు, టీచర్లు మినీ బస్సులో దగ్గర్లోని కొయాచోరో అనే వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా తిరుగు ప్రయాణమయ్యారు.
 
ఈ క్రమంలో రైలు క్రాసింగ్ దగ్గర గేటు వేసి ఉండకపోవడంతో మినీ బస్సు అలాగే వెళ్లింది. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి పట్టాలపై ఉన్న బస్సును ఢీకొంది. 
 
ఒక కిలోమీటరు వరకు మినీ బస్సను రైలు ఈడ్చుకుని వెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 11 మంది మరణించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గేట్‌మ్యాన్‌ను అధికారులు అరెస్టు చేశారు.