గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (19:26 IST)

సన్‌షేడ్ మీదకు దూకుతా వీడియో తీయమన్నాడు.. ఏకంగా పైకే పోయాడు (Video)

ఇటీవలికాలంలో సెల్ఫీలు, సెల్ఫీ వీడియోల పిచ్చి బాగా ముదిరిపోయింది. దీంతో అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేందుకు సన్‌షేడ్ వీడియో కోసం ప్రయత్నించి ఏకంగా ప్ర

ఇటీవలికాలంలో సెల్ఫీలు, సెల్ఫీ వీడియోల పిచ్చి బాగా ముదిరిపోయింది. దీంతో అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేందుకు సన్‌షేడ్ వీడియో కోసం ప్రయత్నించి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. సింగపూర్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
జొనాథన్ చో అనే 17 ఏళ్ల యువకుడు తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లాడు. మాల్ నాలుగో అంతస్తుకు చేరుకున్నాక అక్కడి నుంచి సన్‌షేడ్ మీదకు దూకుతానని, దానిని వీడియో తీయాలని స్నేహితురాలిని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అన్నా అతడు పట్టించుకోలేదు. దీంతో ఆమె వీడియో తీసేందుకు ప్రయత్నిస్తుండగానే అతడు పైనుంచి దూకేశాడు. 
 
అయితే ఆ సన్‌షేడ్ ప్లాస్టిక్‌తో చేసినది కావడంతో అది అతడి బరువును ఆపలేక కూలిపోయింది. దీంతో కిందపడ్డ జొనాథన్ స్నేహితురాలి కళ్లముందే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలపాలై కిందపడిన జొనాథన్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.