శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (11:29 IST)

శునకాలకు కూడా మంకీ పాక్స్... స్వలింగ సంపర్కుల వల్ల..

dogs
మనుషులకే కాదు... శునకాలకు కూడా మంకీ పాక్స్ వ్యాపిస్తుందని తేలింది. ఇద్దరు స్వలింగ సంపర్కుల్లో ఉన్న మంకీపాక్స్ వైరస్‌.. వారి పెంపుడు కుక్కకు సోకినట్లు తెలిపారు. 
 
ఆ ఇద్దరు స్వలింగ సంపర్కుల్లో మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన 12 రోజుల తర్వాత .. వారి దగ్గర ఉంటున్న నాలుగేళ్ల ఇటాలియన్ గ్రేహోండ్ కుక్కలో ఆ లక్షణాలను గుర్తించారు. అంతకుముందు ఆ కుక్కపిల్లకు గతంలో ఎటువంటి అనారోగ్యం లేదని, అయినా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు సైంటిస్టులు తెలిపారు.
 
లాటినో మనిషి, కుక్క నుంచి మంకీపాక్స్ వైరస్ డీఎన్ఏను సేకరించి వాటిని పరీక్షించారు. ఆ ఇద్దరి వద్ద ఉన్న వైరస్‌లో hMPXV-1 ఉన్నట్లు తేల్చారు. దీన్ని B.1 లీనియేజ్‌గా గుర్తించారు. దీని ద్వారా వైరస్ మనిషి నుంచి కుక్కకు వ్యాపించినట్లు ధ్రువీకరించారు.