గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (18:11 IST)

మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?

అమెరికాలో ఓ టీచర్ ఏకంగా విద్యార్థిని బుట్టలోవేసుకుంది. ఆ విద్యార్థిని లొంగదీసుకుని గర్భవతి కూడా అయింది. ప్రస్తుతం మూడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తోంది. అయితే 21 ఏళ్ల వయసు నిండిన తర్వాత తనకు న్యాయం చేయాలని ఆ విద్యార్థి టీచర్‌ను, స్కూలు యాజమాన్యాన్ని నిలదీస్తున్నాడు.
 
టీచర్ లారా క్రాస్(38) విద్యార్థికి 12 ఏళ్ల వయసున్నప్పటి నుంచి అతనికి మాయమాటలు చెప్తూ మూడేళ్ల తరువాత లొంగదీసుకుని శృంగారంలో పాల్గొన్నది. ఆ టీచర్ చేష్టలను పాఠశాల యాజమాన్యం గుర్తించినా కూడా ఎవరూ ఆమెను ఆపలేదని విద్యార్థి, అతని తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. తమ కొడుకును టీచర్ లారా తన ఇంటికి తీసుకెళ్లేదని, అప్పుడే వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసామని అయినప్పటికీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
 
అభంశుభం తెలియని వయసులో తమ కొడుకును లొంగదీసుకుని టీచర్ గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చిందని కూడా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ విద్యార్థికి 17 ఏళ్ల వయసున్నప్పడు బిడ్డకు జన్మనిచ్చిన టీచర్‌పై తల్లిదండ్రులు కేసు పెట్టారు. అయితే టీచర్‌దే తప్పని కోర్టు తేల్చింది. మైనర్ బాలుడని లొంగదీసుకుని తద్వారా గర్భం దాల్చడం నేరమని తీర్పు ఇచ్చింది. దీనితో లారాకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం జైలు నుంచి లారా విడుదలవగా, అమె టీచింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. మరి ఆ విద్యార్థికి, టీచర్‌కు పుట్టిన బిడ్డను దత్తత ఇచ్చేసినట్టు సమాచారం.