గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (13:47 IST)

జోహెన్స్‌బర్గ్‌ భవనంలో మంటలు.. 52మంది సజీవదహనం

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి 52 మంది మరణించారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 52 మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు పేర్కొన్నారు. 
 
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అది తాత్కాలిక నివాసమని, ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు ఎవర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు. ఆ భవనంలో కనీసం 200 మంది నివసిస్తున్నట్టు తెలిపారు.