బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (11:05 IST)

చైనాలో బుద్ధ ట్రంప్‌

ఇటీవల కాలంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో చేస్తున్న మీమ్స్‌, ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యాపారి ఓ అడుగు ముందుకు వేసి...వినూత్న ఆలోచన చేశారు.

ఎప్పుడూ చిటపటలాడుతూ..చిలిపిచేష్టలుతో ఆకట్టుకున్న ట్రంప్‌ ఒక్కసారిగా బుద్ధునిగా మార్చేశారు. బుద్ధుని రూపంలో ఉన్న ట్రంప్‌ విగ్రహాన్ని తయారు చేసి ఈ కామర్స్‌ సైట్లలో అమ్మకానికి పెట్టాడు. తెలుపు రంగులో ఉండి...చాలా ప్రశాంతంతో కూర్చుని ఉన్న ట్రంప్‌ విగ్రహం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

చైనా ఈ కామర్స్‌ సైట్‌ తబావోలో ఉంచగా.. 4.6మీటర్ల భారీ విగ్రహం ధర రూ 44707 కాగా, చిన్న సైజులో 1.6 మీటర్ల విగ్రహం రూ 11,168 పలికింది. ట్రంప్‌ ప్రవచించిన మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ నినాదం స్ఫూర్తితో మేక్‌ యువర్‌ కంపెనీ గ్రేట్‌ ఎగైన్‌ అనే సందేశాన్ని ఇస్తూ తాను ఈ ఉత్పత్తిని రూపొందించానని ఫుజియన్‌ ప్రావియన్స్‌కు చెందిన సెల్లర్‌ తెలిపారు.

వినోదం కోసం ప్రజలు ట్రంప్‌ విగ్రహాన్ని కొనుగోలు చేస్తున్నారని తాను మొత్తం వంద విగ్రహాలు తయారుచేయగా ఇప్పటికే పలు విగ్రహాలు అమ్ముడుపోయాయని చెప్పారు. అహంకారంతో కూడిన ట్రంప్‌ శకం ముగిసినా ఆయనలా ఉండకూడదని తనకు తాను గుర్తుచేసుకునేందుకే తాను ఈ విగ్రహం సొంతం చేసుకున్నానని ఓ కొనుగోలుదారుడు పేర్కొనడం గమనార్హం.