1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (12:46 IST)

కొలంబియాలో స్కూల్ కాంపౌండ్‌లో 751 అస్థిపంజరాలు

కెనాడాలోని బ్రిటిష్ కొలంబియా మరోమారు ఉలిక్కిపడింది. గత నెలలో ఇక్కడ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 2150 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఆ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే తాజాగా వాంకోవర్‌లోని మరో మూసివున్న‌ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో అస్థిపంజరాలను గుర్తించారు. ఇక్కడ ఏకంగా 751 గుర్తు తెలియని సమాధులను కనుగొన్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఒక రాడార్‌ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దాంతో అప్రమత్తమైన దర్యాప్తు అధికారులు దేశవ్యాప్తంగా ఇతర మూసివున్న రెసిడెన్షియల్‌ స్కూళ్లపై కూడా దృష్టిపెట్ట ప‌రిశీలిస్తున్నారు.
 
ఈ క్రమంలో కొవెస్సెస్‌ ఫస్ట్‌ నేషన్‌ ప్రాంతంలోని ‘మారివల్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో రాడార్‌ ద్వారా సెర్చ్‌ చేయగా.. 751 గుర్తుతెలియని సమాధుల వెలుగుచూశాయి. వాటిలో దాదాపు 600 స‌మాధులు చిన్నారుల‌వే ఉన్న‌ట్లు స‌మాచారం. 
 
దాంతో తవ్వకాలు చేపట్టి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్‌ కాథలిక్‌ చర్చి ఆధ్వర్యంలో నడిచినట్టుగా అధికారులు చెబుతున్నారు.