21 ఏళ్లలోపు వాళ్లు ఫోన్ వాడితే జైలుకే... ఎక్కడ?
అమెరికాలోని వెర్మంట్ రాష్ట్రంలో కొత్త బిల్లొకటి తీసుకొచ్చారు. 21 వయస్సు లోపు యువత ఫోన్ వాడితే ఫైన్ వేసేలా, జైలు శిక్ష కూడా విధించేలా దాన్ని రూపొందించారు. ఎస్.212గా పిలుస్తున్న ఆ బిల్లును ఈమధ్యే ఆ రాష్ట్ర సెనెటర్ జాన్ రోడ్జర్స్ ప్రవేశపెట్టారు. దాని ప్రకారం 21 ఏళ్లలోపు యంగ్‌స్టర్స్‌కు ఫోన్ ఉంటే క్రైమ్. అలాంటి వాళ్లకు రూ.70 వేల ఫైన్, ఏడాది వరకు జైలు శిక్ష విధించనున్నారు.
ప్రస్తుత ప్రపంచంలో చాలా నేరాలకు సెల్‌ఫోన్ వాడకం ఓ ప్రధాన కారణమని.. పొలిటికల్ ర్యాడికలైజేషన్, ఆర్థిక నేరాలు ఫోన్‌ల వల్లే ఎక్కువవుతున్నాయని బిల్లులో పొందుపరిచారు. అందుకే యువత మెచ్యూరిటీ పొందే వరకు ఫోన్‌కు దూరంగా ఉంచేందుకు బిల్లును ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు.
మారణాయుధాలు, సిగరెట్లు, మందుపై నిషేధం లాగే ఫోన్లపై బ్యాన్ అవసరమన్నారు. కానీ కొందరు మాత్రం జాన్ తీరును విమర్శిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలపై కాకుండా ఉద్యోగులకు మెడికల్ లీవ్స్, కనీస వేతనం పెంపు లాంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.